ఆరోగ్యానికి మహా భాగ్యం

Health sector gets Rs 62,659 crore, hits 2-year high
  • ‘హెల్త్’కు 8 వేల కోట్లకు పైగా ఎక్కువ కేటాయింపులు
  • ఈ సెక్టార్ మొత్తం బడ్జెట్ రూ.62,659.12 కోట్లు
  • ‘ఆయుష్మాన్ భారత్’కు రూ.6,400 కోట్లు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ హెల్త్ కి ఈసారి బాగానే ప్రాధాన్యత ఇచ్చింది. రెండేళ్ల కన్నా ఎక్కువగా మొత్తం రూ.62,659.12 కోట్లు ఇచ్చారు. ఇది గతేడాదితో పోల్చినా రూ.8,356 కోట్లు (15.38 శాతం) ఎక్కువ. మోడీ సర్కారు గతేడాది ప్రెస్టేజీగా ప్రారంభించిన ‘ఆయుష్మాన్ భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’కు ఈసారి రూ.6,400 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు. నేషనల్​అర్బన్ హెల్త్​మిషన్ కింద రూ.249.96 కోట్లు ఖర్చు పెట్టి ఆయుష్మాన్ భారత్ హెల్త్​ అండ్​ వెల్​నెస్​ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.

ఎన్​ఆర్​హెచ్​ఎంకి రూ.1,349.97 కోట్లు

నేషనల్ రూరల్ హెల్త్ మిషన్(ఎన్​ఆర్​హెచ్​ఎం) కింద రూ.1349.97 కోట్లతో హెల్త్, వెల్​నెస్​ సెంటర్లను అందుబాటులోకి తెస్తారు. ఈ ప్రోగ్రామ్​లో 2022 నాటికి సుమారు లక్షన్నర సబ్​ సెంటర్లను, ప్రైమరీ హెల్త్​ సెంటర్లను హెల్త్​ అండ్​ వెల్​నెస్​ సెంటర్లుగా అభివృద్ధి చేస్తారు. ఈ కేంద్రాల్లో బీపీ, షుగర్, కేన్సర్​తోపాటు ఓల్డేజ్​ వల్ల వచ్చే ఇతర రోగాల ట్రీట్​మెంట్​కి కావాల్సిన పరికరాలు తెప్పిస్తారు.

ఎన్​హెచ్​ఎంకి రూ.2,866 కోట్లు అదనం

నేషనల్ హెల్త్​ మిషన్ (ఎన్​హెచ్​ఎం)కు గతేడాది కన్నా రూ.2,866 కోట్లు అదనంగా రూ.32,995 కోట్లు ఇచ్చారు. అయితే ఎన్​హెచ్​ఎం పరిధిలోని రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన(ఆర్​ఎస్​బీవై)కు పోయినసారి రూ.2,000 కోట్లు ఇచ్చి.. ఈసారి కేవలం రూ.156 కోట్లతోనే సరిపెట్టారు. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్​బడ్జెట్​కు  రూ.10 కోట్లు కోత వేసి..  ఈసారి రూ.40 కోట్లకే పరిమితం చేశారు. ‘నేషనల్ ​ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ ​అండ్ కంట్రోల్ ఆఫ్ కేన్సర్, డయాబెటిస్, కార్డియో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–వాస్కులర్ డిసీజెస్ అండ్ స్ట్రోక్’ విభాగానిదీ ఇదే పరిస్థితి. కిందటేడాది రూ.295 కోట్లు ఇచ్చి ఇప్పుడు రూ.175 కోట్లతోనే సరిపెట్టారు.

‘ఎయిడ్స్’కు రూ.400 కోట్లు ఎక్​స్ట్రా

నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్​ ప్రోగ్రామ్​కి క్రితంసారితో పోల్చితే రూ.400 కోట్లు ఎక్కువే ఇచ్చారు. ఈ కార్యక్రమానికి 2018–19 బడ్జెట్​లో రూ.2,100 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.2,500 కోట్లకు పెంచారు.

ఎయిమ్స్​లకు రూ.3,599.65 కోట్లు

ఎయిమ్స్‌‌‌‌ లకు బడ్జెట్​లో రూ.3,599.65 కోట్లు ఫైనల్ చేశారు. నర్సింగ్​ సర్వీసుల అప్​గ్రేడింగ్, స్ట్రెంతెనింగ్ కోసం రూ.64 కోట్లు; జిల్లా ఆసుపత్రులు, స్టేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీల అప్​గ్రెడేషన్ కోసం రూ.800 కోట్లు ఇచ్చారు.  జిల్లా​ హాస్పిటళ్లను కొత్త మెడికల్​ కాలేజీలుగా మార్చటానికి రూ.2000 కోట్లు ఇచ్చింది.

‘ఆయుష్’కి రూ.1939 కోట్లు

ఇంగ్లిష్ మెడిసిన్స్​కి బదులుగా ఆయు-ర్వేదం మందుల వాడకాన్ని ఎంకరేజ్ చేయాలని మోడీ సర్కారు టార్గెట్​గా పెట్టుకుంది. ఈ మేరకు ఆయుష్ మినిస్ట్రీకి గతేడాది కన్నా 15 అదనపు నిధులు కేటాయించింది. ఆయుర్వేద, న్యాచు రోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి (ఆయుష్ )సెక్టార్​కి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.1, 939.76 కోట్ల బడ్జెట్ ఇచ్చింది. 2018–19 బడ్జెట్​లో రూ.1,692.77 కోట్లే మంజూరు చేసింది.

Latest Updates