హెల్దీ అండ్‌ వెల్దీ మైక్రోగ్రీన్స్

రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కూరగాయాలు‌‌‌‌‌‌‌‌ ఎంత తింటున్నా.. ఇంకా హెల్దీ వెజ్‌ ఐటమ్స్‌‌‌‌‌‌‌‌ కావాలనిపిస్తున్నాయా…? అయితే ‘మైక్రో గ్రీన్స్‌‌‌‌‌‌‌‌’ ట్రై చేయండి. ఇప్పుడిది లేటెస్ట్‌‌‌‌‌‌‌‌ హెల్దీ ట్రెండ్‌ . ఆరోగ్యంతో పాటు, ఆదాయాన్ని కూడా అందిస్తాయి. ఇంతకీ ‘మైక్రో గ్రీన్స్‌‌‌‌‌‌‌‌’ అంటే ఏంటి? నిజంగా వాటివల్ల అంత హెల్దీ బెనిఫిట్లు ఉన్నాయా? తెలుసుకోవాలంటే చదవండి…

ఇంట్లో వాళ్లంతా ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే.. అది అమ్మ చేతిలో ఉంటుంది. హెల్దీ ఫుడ్ , హెల్దీ లైఫ్ స్టైల్ చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవాటు చేస్తే.. వాళ్లు హెల్దీగా ఉంటారు. అయితే ఆనందంగా జీవించడానికి హెల్త్​ ఒక్కటే సరిపోదు. డబ్బు కూడా కావాలి. అందుకే ఆరోగ్యంతోపాటు ఆదాయం అనే కొత్త కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ను తెరపైకి తెస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌​ ప్రస్తుతం అర్బన్ ఏరియాలకే పరిమితం అవుతున్నప్పటికీ.. చిన్న చిన్న పట్టణాలకు విస్తరించేందుకు ఏమంత పెద్ద సమయం పట్టదని చెబుతున్నారు అనలిస్ట్‌‌‌‌‌‌‌‌లు. ఎందుకంటే.. ఇప్పుడు కరోనా కారణంగా పల్లె ప్రాంతాలకు వెళ్తున్నవాళ్లు ఎక్కువగా నగర ప్రజలే కాబట్టి. మైక్రోగ్రీన్స్‌ అంటే ఆకు కూరలు, కూరగాయ మొక్కలు పూర్తిగా కాకుండా, మూడు అంగుళాల వరకు మాత్రమే పెరిగిన వాటిని ‘మైక్రో గ్రీన్స్‌‌‌‌‌‌‌‌’ అంటారు. అంటే ఇవి అప్పుడే మొలకలొచ్చిన ఆకు కూరలు, కూరగాయలు. చాలా లేత మొక్కలు. క్యా రెట్స్‌‌‌‌‌‌‌‌, క్యాబేజి, బీట్‌‌‌‌‌‌‌‌రూట్స్‌‌‌‌‌‌‌‌, ఆకు కూరలు వంటి వాటిని మాత్రమే ‘మైక్రో గ్రీన్స్‌‌‌‌‌‌‌‌’గా పిలుస్తారు. అలాగని అన్ని మొక్కల్ని లేతగా తినడానికి వీలుండదు. పూర్తిగా ఎదిగిన మొక్కలతో పోలిస్తే వీటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రుచి కూడా బాగుంటుంది. అందుకే కొన్ని రెస్టారెంట్లు‌‌‌‌‌‌‌‌ వీటిని ఎక్కువగా వాడుతుంటాయి.

వంటిల్లు చాలు..

మైక్రోగ్రీన్ సీడ్స్​ పేరుతో మార్కెట్ లో రకరకాల విత్తనాలు అమ్ముతున్నారు. వీటి కాస్ట్​ కూడా చాలా ఎక్కువగా ఉంటోం ది. వీటి ధర చూసే చాలామంది మైక్రోగ్రీన్స్​ తినడం గురిం చి పెద్దగా ఆలోచించడం లేదు. అయితే మార్కెట్ లో అమ్మే సీడ్స్​ జోలికి వెళ్లకుం డా ఒక్కసారి వంటింటి వైపు చూస్తే చాలంటున్నారు నిపుణులు. పోపుల డబ్బాలో ఉండే ధనియాలు, ఆవాలు, మెంతులు, వంటింట్లో ఉండే పెసర్లు, మినుము లు, రాగులు, గోధుమలు, సజ్జలు, జొన్నలు, కందులు.. ఇవే కాకుం డా సన్ ఫ్లవర్ వంటివి కూడా మైక్రో గ్రీన్స్​గా పెంచుకోవచ్చు. దీనికి కనీసం 12–14 రోజుల టైమ్‌ పడుతుంది.

ఎలా పెంచాలంటే..

ట్రాన్స్​పరెం ట్ గా ఉండే ఫుడ్ ప్యాకిం గ్ బాక్స్​లు మార్కెట్ లో దొరుకుతాయి. అప్పుడప్పుడు పండ్లు, కూరగాయలు కొన్నప్పుడు కూడా ఇలాంటివి వస్తుంటాయి. వాటిని పక్కన పెట్టుకుం టే మైక్రోగ్రీన్స్​ పెం చాలనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. అవి లేదంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ ట్రేల్లో కూడా మైక్రో గ్రీన్స్​ను పెం చొచ్చు. కావలసిం దల్లా సర్సరీల్లో దొరికే వర్మీ కంపోస్ట్, కోక్ పిట్ మాత్రమే. ఇవి తెచ్చుకొని అందులో కొంచెం మట్టిని కలిపి ట్రేలో ఇంచు మందంతో ముందుగా ఒక లేయర్ వేయాలి. ఆ తర్వాత వేటిని మైక్రోగ్రీన్స్​గా పెంచాలనుకుంటున్నారో ఆ విత్తనాలను ట్రేలో లేయర్ పై వేయాలి. విత్తనాలపై మరో లేయర్ ను వేసి ఎండ తగలని ప్లేస్ లో పెట్టాలి. మూసి ఉండే అల్మారాల్లో పెట్టినా సరే. అయితే ఇలా పెట్టే ముం దు వాటర్ స్ప్రే చేయాలి. దీం తో ఒకరోజులోనే విత్తనాల నుంచి చిన్నగా మొలకలు మొదలవుతాయి. మొలకలు పైకొచ్చే వరకు అల్మారాలోనే ఉంచి, ఆ తర్వాత కొంచెం ఎండ తగిలేచోట పెట్టాలి. పూర్తిగా ఎండలో కాకుండా కిటికీలు, వరండాలో పెడితే రెండు మూడు రోజులకు మొలకలు మరింత పెద్దవవుతాయి. అయితే ఇవి ముందుగా లేత ఆకుపచ్చ రంగులో ఉన్నా.. మరుసటి రోజుకు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతాయి. ఇవి మూడు ఇంచుల వరకు పెరిగిన తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది.

ఎలా తినాలి?

మైక్రో గ్రీన్స్​తో రకరకాల డిష్ లు చేసుకోవచ్చు. అయితే పూర్తిగా వీటితోనే కాకుం డా వీటిని గార్నిష్ ఐటెమ్​లా వాడుకోవాలి. లేదంటే సలాడ్స్​లా కూడా తినొచ్చు. పిజ్జా, బర్గర్ , గార్లిక్ బ్రెడ్ వంటివాటిపై చిన్నగా తరిగిన మైక్రో గ్రీన్స్​ను చల్లుకొని తినొచ్చు. ఒక్కోరకం మైక్రోగ్రీన్ ఒక్కో టేస్ట్ తో ఉంటుంది. పైగా వీటి ఫ్లేవర్ క్లియర్ గా తెలుస్తుంది. ఏ డిష్ ప్రిపేర్ చేసుకున్నా దానిపై మైక్రోగ్రీన్స్​తో గార్నిష్ చేసుకొని తినొచ్చు. స్ప్రౌట్స్​ తినే అలవాటు ఉన్నవాళ్లు వాటిలో కూడా మైక్రోగ్రీన్స్​ను కలుపుకొని తినొచ్చు.

ప్లానింగ్ ప్రకారం పెంచుకుంటే..

మైక్రోగ్రీన్స్​తో ఎక్స్​ట్రా ఇన్ కమ్​ పొందాలని అనుకునేవాళ్లు వాటిని ఓ ప్లానిం గ్ ప్రకారం పెంచాలి. ఎవరికైతే అమ్మాలనుకుంటున్నామో వాళ్లకు రెగ్యులర్ గా సప్లయ్ చేసేలా ప్లానింగ్ చేసుకోవాలి. అంటే ఇవాళ రెం డుమూడు ట్రేలలోని మైక్రోగ్రీన్ కట్ చేస్తే మరుసటి రోజు ఇంకో రెండు మూడు ట్రేలు కట్ చేయడానికి సిద్దంగా వచ్చేలా ప్లాన్ చేసుకోవాలి. దీనికి పెద్దగా పెట్టుబడి పెట్టాల్సి న పనిలేదు. ఇంట్లో పనులు చేసుకుం టూనే ఈ చిన్న బిజినెస్ చేసుకోవచ్చు. కరోనా వంటి పరిస్థితుల్లో ఇది ఎక్స్​ట్రా ఇన్ కమ్​గా బాగా ఉపయోగపడుతుం ది. అయిత దీనికోసం కొంచెం ఓపిక, కొంచెం శ్రమ, అంతకు మించి మార్కెటిం గ్ టెక్నిక్స్​ తెలిసుండాలి. అయితే ఇదొక్కటే ఇన్ కమ్​ సోర్స్​గా కాకుండా చన్నీళ్లకు వేడినీళ్లలా ఉపయోగపడుతుంది. అయితే పూర్తిగా ఎఫర్స్ట్ అన్నీ ఈ కాన్సెప్ట్​ పైనే పెట్టి, మార్కెటింగ్ సోర్సెస్ ను పెంచుకుంటే మంచి ఇన్ కమ్​ పొందొచ్చు. ఒకవేళ అమ్ముడు పోకపోయినా ఇంట్లో వాళ్లంతా హాయిగా తినొచ్చు. అమ్మితే ఆదాయం, అమ్ముడుపోకపోతే ఆరోగ్యం. అంతేతప్ప ఎటువంటి నష్టమైతే లేదు.

ఇంతకీ ఇన్ కమ్ ఎలా?

సిటీలో ఉండేవాళ్లకు మైక్రోగ్రీన్స్ పెంచుకునే ప్లేస్ , ఓపిక, సమయం ఉండకపోవచ్చు. అలాంటి వాళ్లు ఇప్పుడు ఆన్ లైన్ లో మైక్రోగ్రీన్స్ ను తెప్పించుకుం టున్నారు. పెద్ద పెద్ద ఫైవ్ స్టా ర్ హోటల్స్ , సూపర్ మార్కెట్స్ కూడా మైక్రోగ్రీన్స్ ను కొంటున్నాయి. వందగ్రాముల నుం చి కిలో వరకు ఎంత ఉంటే అంత కొంటున్నాయి. వంద రూపాయల నుంచి 2500 రూపాయల వరకు వీటి ధర పలుకుతోంది. మైక్రోగ్రీన్ వెరైటీని బట్టి ధరను చెల్లిస్తు న్నాయి. ఆన్ లైన్ లో సెర్చ్​ చేస్తే వీటిని కొనేవాళ్లు ఈజీగా దొరుకుతారు. లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్ ను నేరుగా సంప్రదించి, మైక్రోగ్రీన్స్ ను సరఫరా చేస్తామని చెప్పొచ్చు.

Latest Updates