గుండె జబ్బులను ఈజీగా గుర్తించవచ్చు

ఇందుకోసం క్యాడ్‌‌‌‌‌‌‌‌-పీఆర్ఎస్ విధానం
డెవలప్ చేశామని ప్రకటించిన మెడ్జినోమ్

హైదరాబాద్, వెలుగు: జన్యువుల వివరాలతో గుండె జబ్బులను సులువుగా గుర్తించే విధానాన్ని డెవలప్ చేసినట్టు జెనోమిక్స్, డయాగ్నస్టిక్స్, రీసెర్చ్ కంపెనీ మెడ్‌జినోమ్ ల్యాబ్స్ ప్రకటించింది. తాము రూపొందించిన క్యాడ్ –పీఆర్ఎస్ (కొరోనరీ ఆర్ట‌రీ డిసీజ్-జీనోమ్-వైడ్ పాలిజెనిక్ రిస్క్ స్కోర్) విధానాన్ని పలువురిపై ప్రయోగించగా ఆశించిన ఫలితాలు వచ్చాయని పేర్కొంది. జన్యు క్రమం ఆధారంగా కొరోనరీ ఆర్ట‌రీ డిసీజ్ / మయోకార్డియర్డి ల్ ఇన్ఫార్క్షన్ ప్రమాదాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చని తెలియజేసింది. క్యాడ్–పీఆర్ఎస్ కోసం బ్రాడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎంఐటీ, హార్వర్డ్ పరిశోధకులతో మెడ్జినోమ్ కలిసి పనిచేసింది. మసాచు సెట్స్ జనరల్ హాస్పిటల్, బోస్టన్ , నారాయణ హెల్త్, బెంగళూరు, ఎటర్నల్ హాస్పిటల్, జైపూర్, మద్రాస్ మెడికల్ మిషన్, చెన్నై, కేఎంసీహెచ్, కోయంబత్తూరు, మరికొన్ని దక్షిణాసియా దేశాల్లోనూ పీఆర్ఎస్ వ్యాధిపై పరిశోధనలు జరిపింది.

Latest Updates