కరోనాతో చనిపోయిన భర్త.. ఫోన్లో ఊహించని మెస్సెజ్ చూసిన భార్య

కరోనావైరస్ బారినపడి.. చనిపోయే ముందు ఓ వ్యక్తి తన భార్యకు ఫోనులో కంటతడిపెట్టించే లెటర్ రాశాడు. అమెరికాలోని కనెక్టికట్ లో నివసించే జోనాథన్ స్థానిక న్యాయస్థానంలో పనిచేసేవాడు. కరోనా వల్ల భయపడుతూనే.. వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొని తన విధులు నిర్వర్తించేవాడు. అయినాసరే.. జోనాథన్ కరోనా బారిన పడ్డాడు. దాంతో అతన్ని డాన్బరీలోని ఆసుపత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు మొదట జోనాథన్ ను రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయాలని చెప్పారు. కానీ, ఆ తర్వాత జోనాథన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌లో ఉంచారు. జోనాథన్ కోయెల్హో మార్చి 26న కరోనావైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరాడు. కరోనా చికిత్స పొందుతుండగా.. ఏప్రిల్ 22న గుండెపోటుతో మరణించాడు. అతను ఆసుపత్రిలో గడిపిన 28 రోజులలో.. దాదాపు 20 రోజులు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. జోనాథన్ చనిపోయిన తర్వాత డాక్టర్లు అతని భార్య కేటీకి ఫోన్ చేసి చెప్పారు. కేటీ వెంటనే హాస్పిటల్ కు వెళ్లి తన భర్తకు సంబంధించిన వస్తువులను తీసుకుంది. ఆ సమయంలో కేటీ తన భర్త అయిన జోనాథన్ ఫోనులో ఒక హృదయవిదారక నోట్ ను చూసింది.

ఆ నోట్ ప్రకారం.. ‘నేను చాలా అదృష్టవంతుడిని. ఇప్పటివరకు నేను కోరుకున్న జీవితాన్ని నాకు అందించావు. నీకు భర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను. మన పిల్లలు బ్రాడిన్ మరియు పెన్నీలకు తండ్రిని కావడం కూడా గర్వపడే విషయం. నేను నిన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. నేను కలుసుకున్న అత్యంత అందమైన వ్యకివి నువ్వు. నువ్వు చాలా స్పెషల్. నువ్వు పిల్లలు సంతోషంగా బతుకుతారని అనుకుంటున్నాను. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు. ఆ నవ్వే నన్ను నీతో ప్రేమలో పడేలా చేసింది. నువ్వు పిల్లలకు మంచి తల్లిగా ఉండటం గొప్ప విషయం. బ్రాడిన్ నాతో అత్యంత అనుబంధం కలిగినవాడు. నేను అతనికి తండ్రిగా ఉన్నందుకు గర్వపడుతున్నాను. అతను చేసిన మరియు చేస్తున్న అద్భుతమైన పనులన్నింటికీ గర్వపడుతున్నాను. పెనెలోప్ ఒక యువరాణి. తను కోరుకున్నది తనకు దక్కుతుంది. నిన్ను, పిల్లలను ప్రేమించే వ్యక్తి ఎవరైనా నీకు నచ్చితే అతనితో సంతోషంగా ఉండండి. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను’అని జోనాథన్ తన ఫోనులో భార్యా, పిల్లల గురించి కంటతడిపెట్టించేలా రాశాడు.

కరోనావైరస్ మహమ్మారి వల్ల అమెరికా తీవ్రంగా నష్టపోయింది. అక్కడ కరోనా బారినపడిన వారి సంఖ్య తొమ్మిది లక్షలు దాటింది. దాదాపు 53 వేల మంది కరోనా వల్ల మరణించారు.

For More News..

వరల్డ్ ట్రయాథ్లాన్ గ్రాండ్ ఫైనల్ రద్దు

పుల్వామాలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు మృతి

లాక్డౌన్ లో కొత్త దందా.. కారు ఫేక్ పాస్ కు రూ. 30,000

Latest Updates