భారీగా తగ్గిన వంట గ్యాస్  ధరలు

వంట గ్యాస్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు గుడ్ న్యూస్ తెలిపాయి. వంట గ్యాస్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు చెప్పాయి. ఇందులో భాగంగా 14.2 కేజీల LPG గ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.214 తగ్గింది. దీంతో గ్యాస్ ధర రూ.583.50 నుంచి ప్రారంభం అవుతుంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కూడా రూ.336 తగ్గి.. రూ.988 నుంచి ప్రారంభం అవుతుంది. నెలవారీ సమీక్షలో ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ఈ నిర్ణయంతో మెట్రో నగరాల్లో గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ లో రూ.796 ఉన్న LPG సిలిండర్ ధర.. రూ.589.50 లకు తగ్గిపోయింది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.744 నుంచి రూ.611.50కి పడిపోయింది. ముంబై నగరంలో రూ.714.50 నుంచి రూ.579కి దిగొచ్చింది. కోల్‌కతాలో ఒక్కో సిలిండర్‌పై రూ.190 తగ్గి రూ.584.50 కాగా, చెన్నై నగరంలో రూ.569.50కు ధర పడిపోయింది. ఈ ధరలన్నీ మే ఒకటో తేదీ నుంచే అమల్లోకి రానున్నాయి.

Latest Updates