మందు.. చిందు.. డబ్బులతో హోరెత్తిన టీఆర్ఎస్ నేతల ట్రాక్టర్ల ర్యాలీ

జగిత్యాల జిల్లా: మందు చిందు డబ్బులతో హోరెత్తింది ధర్మపురి నియోజకవర్గ ట్రాక్టర్ల ర్యాలీ. రెవెన్యూ చట్టం బిల్లు ఆమోదంతో సంబరాలలో మునిగి తేలుతున్నారు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు ర్యాలీగా వచ్చి, ఒక్కో ట్రాక్టర్ కు 2,000 డబ్బులు పంచడంతో పాటు.. మందు విందులతో ధర్మపురి నియోజకవర్గం హోరెత్తింది. ఓ పక్క సంబరాల పేరుతో స్వచ్ఛందంగా ప్రేమతో ర్యాలీ నిర్వహించాల్సింది పోయి మందు, విందు, డబ్బులతో ధర్మపురి టీఆర్ఎస్ నాయకులు ఎంజాయ్ చేస్తున్నారు. స్వంత డాక్టర్లు కాకుండా గ్రామ పంచాయతీకి కేటాయించిన ట్రాక్టర్లు ర్యాలీలో వాడినట్టు సమాచారం.

 

Latest Updates