భారీగా అమ్మోనియం నైట్రేట్ సీజ్

చిట్యాల, వెలుగు: భారీ మొత్తంలో అక్రమంగా నిల్వ చేసిన ప్రమాదకర అమ్మోనియం నైట్రేట్‌ ను పోలీసులు పట్టు కున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మం డలం పెద్ద కాపర్తి శివారులోని అం జన ఎక్స్‌ ప్లో జివ్‌ కంపెనీ, నా ర్కట్‌ పల్లి మండలం అమ్మనబోలు సంజన ఎంటర్‌ ప్రైజెస్‌ గోదాంలో వీటిని సీజ్‌ చేశారు. పై అధికారులు ఇచ్చిన సమాచారం, ఆదేశాలతో శనివారం రాత్రి పైరెండు కంపెనీలపై దాడి చేసి 230 మెట్రిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల అమ్మోనియం నైట్రేట్‌ ను గుర్తిం చామని శాలిగౌరరం సీఐ క్యాస్ట్రో రెడ్డి తెలిపారు.

ఇందులో 180 మెట్రిక్ టన్నుల నిల్వకు మాత్రమే అనుమతులు ఉన్నాయన్నారు. మరో 50 మెట్రిక్ టన్నులు అక్రమంగా ఉండడంతో దాన్ని సీజ్ చేసి, కంపెనీ ఎండీ డి.వెంకటస్వామి, మేనేజర్ నర్సిం హపై సెక్షన్ 05, 09 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు న్నామని పేర్కొన్నారు. క్లూస్ టీం నమూనాలు సేకరించారని తెలిపారు.

Latest Updates