వీడియో: విశాఖలో ఘోర ప్రమాదం.. భారీ క్రేన్ విరిగిపడి పలువురు మృతి

విశాఖపట్టణంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో ఘోర ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగిపడి  పది మందికిపైగా మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్రేన్ కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్రేన్ ను తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే క్రేన్ భారీగా ఉండటంతో మృతల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు మాత్రం ఇంకా తెలియలేదు. యాజమాన్యం స్పందిస్తేనే.. ఏం జరిగింది? ఎలా జరిగింది? ఎంత మంది చనిపోయారనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. కొన్ని రోజుల క్రితం ఇదే విశాఖలో ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకై 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగి కొంతకాలం కూడా కాకముందే.. మళ్లీ ఈ ఘటనతో వైజాగ్ ఉలిక్కిపడింది.

ప్రమాద ఘటనపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరా తీశారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని ఆర్డీవోకు ఫోన్ ద్వారా సూచించారు. హిందుస్తాన్ షిప్ యార్డ్ వద్ద రక్షణ శాఖ ఉద్యోగులు సహాయ చర్యలు చేపట్టారు.

For More News..

అనారోగ్యంతో శేఖర్ కమ్ముల తండ్రి మృతి

అక్కాచెల్లెళ్లపై ఎనిమిది మంది అత్యాచారం

రెండు మిని ఫ్లైట్స్ ఢీ.. స్పాట్లోనే అందరూ మృతి

Latest Updates