శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..   పాతాళగంగకు హారతి..

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..   పాతాళగంగకు హారతి..

కార్తీకమాసం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయంకు చేరుకుని.. పెద్ద ఎత్తున కార్తీక  దీపారాధనలు నిర్వహించారు. గంగాధర మండపం, ఉత్తర మాఢవీధి పూర్తిగా కార్తిక దీపారాధనలతో వెలిగిపోయింది. కార్తీకమాసం... ఆదివారం సెలవు దినం కావడంతో ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది.

ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కార్తీక పౌర్ణమి గడియలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు.   పాతాళగంగ వద్ద పుణ్యనది హారతి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా కృష్ణవేణి నదీమతల్లికి దేవస్థానం అర్చకులు కర్పూర హారతులు ఇచ్చి...  ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం వైభవంగా జరిగింది.