మునిగిన పుణ్యక్షేత్రం… నదులైన వీధులు.. వీడియో

heavy-flood-in-triambakeshwar-temple

మహారాష్ట్రలో ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా అత్యంత భారీవర్షాలు పడుతున్నాయి. గడిచిన 3 రోజులుగా మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఎడతెరిపిలేకుండా కురిశాయి. దీంతో… పలుజిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. చెరువులు నిండి.. కట్టలు తెగి… ఊళ్లకు ఊళ్లే మునిగిపోతున్నాయి.

నాసిక్ జిల్లాలోనూ అదే పరిస్థితి. పవిత్ర పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్ వరదనీట మునిగిపోయింది. త్రయంబకేశ్వర ఆలయం గుడి చుట్టూ ఉన్న వీధులు నదులను తలపించాయి. భారీవర్షాలకు అక్కడ జనజీవనం స్తంభించి పోయిన పరిస్థితి. వరదనీరు ఇళ్లలోకి చేరింది. రోడ్లు కనుమరుగైపోయాయి. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ఇండ్లు మునిగిపోయాయి. త్రయంబకేశ్వర క్షేత్రం మునిగిపోవడంతో… భారీగా ఆస్తినష్టం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు.

Latest Updates