రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన

ఆగ్నేయ బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్ప‌డిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో రాష్ట్రం‌లోని పలు జిల్లాల్లో ఇవాళ(గురువారం), రేపు శుక్ర‌వా‌రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.ముఖ్యంగా కామా‌రెడ్డి, జన‌గామ, సంగా‌రెడ్డి, మెదక్‌, కుమ్రం భీం ఆసి‌ఫా‌బాద్‌, జోగు‌ళాంబ గద్వాల, జగి‌త్యాల, నిర్మల్‌, భద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాల్లో అక్క‌డ‌క్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురు‌వొ‌చ్చని వాతా‌వ‌రణ కేంద్రం అధి‌కారి రాజా‌రావు తెలి‌పారు.

Latest Updates