హైదరాబాద్ సహా రాష్ట్రంలో జోరు వర్షాలు

రాష్ట్రంలో జోరు వానలు పడుతున్నాయి.ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో.. హైదరాబాద్ నగరం సహా… రాష్ట్రంలోని పలుజిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి.

హైదరాబాద్ లో ఈ మధ్యాహ్నం భారీవర్షం పడింది. ఆ తర్వాత కూడా జల్లులు కొనసాగాయి.

ఉమ్మడి కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వరంగల్ , ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు పడ్డాయి. వర్షాల కారణంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి.

Latest Updates