ఎమర్జేన్సీ అలర్ట్: మరో మూడు, నాలుగు గంటలు భారీ వర్షం

ఎడతెరిపిలేని వర్షాలతో హైదరాబాద్ అల్లకల్లోలం అవుతోంది. ప్రతిరోజూ వస్తోన్న వానలతో హైదరాబాద్ ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా నగరంలో మరోసారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. భారీగా కమ్ముకున్న మబ్బులతో పట్టపగలే సిటీ చీకటిమయమైంది. మరో మూడు లేదా నాలుగు గంటల పాటు భారీ వర్షం కురిసే చాన్సుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలెవరూ రోడ్ల మీదికి రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది. చంపాపేట్, కొత్తపేట, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, హిమాయత్ నగర్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, పంజాగుట్ట, బంజారాహిల్స్, కోఠి, మలక్ పేట, చంపాపేట్, సైదాబాద్, రామాంతపూర్, సికింద్రాబాద్, మెహిదీపట్నం తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తోంది.

For More News..

హైదరాబాద్‌కు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 కోట్ల ఆర్థికసాయం

కరోనాతో సోషల్ మీడియా స్టార్ మృతి.. బెడ్ మీద నుంచి అభిమానులకు చివరి సందేశం

డిప్యూటీ సీఎం ఫోన్ నుంచి షేర్ అయిన పోర్న్ క్లిప్

Latest Updates