హైదరాబాద్ లో భారీ వర్షం: మంత్రి ఆస్పత్రిలోకి నీళ్లు

హైదరాబాద్ లో ఇవాళ మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1.30 నుంచి దాదాపు మూడు  నాలుగు గంటల పాటు భాగ్యనగరాన్ని వాన ముంచెత్తింది. రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్ లో ఇబ్బందులు పడ్డారు.

ఐసీయూలోకీ నీళ్లు.. పేషెంట్ల తరలింపు

లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. కూకట్ పల్లి, అల్విన్ కాలనీ, మియాపూర్ సహా చాలా ప్రాంతాల్లో ప్రజలు కష్టాలు ఎదుర్కొన్నారు. కొన్ని కాలనీల్లో బైక్ లు వరదకు కొట్టుకుపోయాయి.

ఇక జీడిమెట్ల సూరారంలో మంత్రి మల్లారెడ్డికి చెందిన నారాయణ హాస్పిటల్ లోకి భారీగా వాన నీళ్లు చేరాయి. ఐసీయూల్లోకి కూడా నీళ్లు వచ్చాయి. దీంతో పేషెంట్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నీరు ఆగకుండా లోపలికి వస్తుండడంతో పేషెంట్లను మరో చోటకి మార్చింది  ఆస్పత్రి యాజమాన్యం.

సిటీలో వేర్వేరు ప్రాంతాల్లో వర్షపాతం

కుత్బుల్లాపూర్ – 7.8 సెంటీమీటర్లు

అల్విన్ కాలనీ – 6.6 సెంటీ మీటర్లు

అంబర్ పేట్: 5.9 సెంటీమీటర్లు

రామాంతపూర్ – 5.7 సెంటీమీటర్లు

హైదర్ నగర్ – 5.5 సెంటీమీటర్లు

ముషీరాబాద్ – 5.1 సెంటీమీటర్లు

Latest Updates