జోగులాంబ గద్వాలలో భారీ వర్షం

జోగులాంబ గద్వాల: జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. నిన్న రాత్రి సుంకులమ్మ మెట్టు, గంజి పేట, కుంట వీధుల్లో వాన నీరు ఇళ్లలోకి చేరింది. మెయిన్ రోడ్లపై మోకాలు లోతు నీరు పారుతోంది. దీంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పాత బస్టాండ్ సర్కిల్, రాజీవ్ మార్గ్, కొత్త బస్టాండ్, పెట్రోల్ బంక్, కుంట వీధి, గంజి పేట, సుంకులమ్మ మెట్టు ఏరియాలన్నీ జలమయం అయ్యాయి. కుంట వీధిలో వర్షపు నీరంతా ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలందరూ రాత్రంతా భయం భయంగా జాగారం చేయాల్సి వచ్చింది. గంజి పేటలో 30 గుడిసెలలో నీరు చేరడంతో జనం నీటిని తోడి పోసుకున్నారు. గతంలో ఎన్నడూ చూడనంత భారీగా వర్షం కురిసినట్లు స్థానికులు చెబుతున్నారు. వాన నీటిని తోడిపోసేందుకు నానా తంటాలు పడుతున్నారు. సరుకులు.. వస్తువులన్నీ నీట మునిగి పాడైపోయాయి.

 

Latest Updates