బీహార్ ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు

బీహార్‌ రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలు బీహార్‌ ను ముంచెత్తుతున్నాయి. నేపాల్‌లో వర్షాలు కురుస్తుండటంతో దాని ప్రభావం బీహార్‌ రాష్ట్రం పై చూపింది. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా బీహార్‌ లో కురుస్తున్న వర్షాలకు 78 మంది మృతి చెందారు. మరో 55 లక్షల మంది నిరాశ్రయులయ్యారని బీహార్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.ఒక్క సీతామర్హిలో అత్యధికంగా 18 మంది మృతి చెందారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 55 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 1,119 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసింది. 26 NDRF సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. నేపాల్‌లో వర్షాల కారణంగా అక్కడి వరద నీరు భారీ స్థాయిలో బీహార్‌లోని లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటోందని అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలోని 6 నదులు ప్రమాదకర స్థాయిని దాటి ఉధృతంగా ప్రవహిస్తున్నాయని అధికారులు తెలిపారు.

Latest Updates