ముంబైలో మళ్లీ భారీ వర్షాలు

ముంబై లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో ముంబైలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లు సరిగా కనిపించక అంధేరి ప్రాంతంలో మూడు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు.గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, సియాన్ రైల్వే స్టేషన్ లో పట్టాలు నీటమునిగాయి. దీంతో, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

రాత్రి 2.30 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు ఏకంగా 51 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఒక రోజు ముంబైలో కురిసే సాధారణ వర్షపాతం కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఇవాళ కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Latest Updates