తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం…ఇబ్బందుల్లో ప్రజలు

తెలంగాణలో వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింప చేసింది. నిన్న(శుక్రవారం) సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పంట పొలాలన్నీ నీట మునిగాయి.

హైదరాబాద్ నగరంలో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇవాళ ఉదయం వరకు వర్షం తెరిపి ఇవ్వకుండా కురుస్తూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయమ్యాయి. ఉద్యోగాలకు వెళ్లే వారు వర్షంలో తడుస్తూనే వెళ్తున్నారు. వర్షం కారణంగా రోడ్లన్నీ గుంతలుగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి బారీ గా వర్షం నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు… ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో మరో 24 గంటల పాటు రెండు తెలుగు రాష్ట్రాలలో  భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

 

Latest Updates