రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు

హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు భారీ నుంచి అతిభారీ వ‌ర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్ నుండి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు 1.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొన‌సాగుతోంద‌ని, దీని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆదివారం ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Latest Updates