తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఇప్పటికే ఉపరితల ఆవర్తనం కారణంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటలలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో మరో రెండు రోజులు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

ఇప్పటికే గత మూడు రోజులుగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా ప్రాజెక్టులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి.

Latest Updates