అలర్ట్: ముంచుకొస్తున్న నివార్ తుఫాను

హైదరాబాద్: తుఫాను ముంచుకొస్తోంది. నివార్‌‌గా పిలుస్తున్న ఈ తుఫానుతో తమిళనాడుకు ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం పశ్చిమ, వాయువ్య దిశల్లో ప్రయాణించి మంగళవారం ఉదయం 5.30కు తుఫానుగా మారింది. పుదుచ్చేరికి తూర్పు, ఆగ్నేయ దిశగా 410 కి.మీ.లు, చెన్నైకి ఆగ్నేయ దిశగా 450 కి.మీ.ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని పేర్కొంది. తమిళనాడులోని కరైకల్-మామల్లాపురం మధ్య పుదుచ్చేరికి సమీపంలో బుధవారం సాయంత్రం తీవ్ర తుఫానుగా మారి తీరాన్ని దాటనుందని సమాచారం. తీరాన్ని దాటే సమయంలో గంటకు 100 కి.మీ.ల నుంచి గరిష్టంగా 120 కి.మీ.ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

Latest Updates