రాయలసీమలో భారీ వర్షం: పలు రైళ్లు నిలిపివేత

కర్నూలు: ఆంధ్ర ప్రదేశ్ కర్నూలులో పడిన భారీ వర్షాలకు రైలు పట్టాలు తెగిపడ్డాయి. ఈ ఘటన నంద్యాల – గిద్దలూరు రైలు మార్గమద్యంలోని గాజులపల్లి దిగువమెట్ట మధ్య జరిగింది. దీంతో గుంటూరు – గుంతకల్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచి పోయాయి. అలాగే నంద్యాల స్టేషన్‌లో హుబ్లి-విజయవాడ ప్యాసింజర్‌ను నిలిపివేశారు. వర్షం దాటికి వరద ఎక్కువవడంతో పట్టాల కింద ఉన్న మట్టి తొలగి పోయి ప్రమాదకరంగా మారింది. ఆళ్లగడ్డ గురుకుల, ఉన్నత పాఠశాలల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. మహానంది ఆలయంలో భారీగా నీళ్లు చేరాయి.

Latest Updates