అశ్వారావుపేటలో భారీ వ‌ర్షాలు.. పొంగి ప్రవహిస్తున్న వాగులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మంగళవారం సాయంత్రం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మండలంలో పలు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. పాలవాగు, పెద్దవాగు, గుండేటి వాగు, మద్దులమాడ వాగు, లోతు వాగులు అన్ని గరిష్ఠ నీటి మట్టంతో వరద నీరు ప్రవహిస్తుండడంతో పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో నీటి పారుదల శాఖ అధికారులు పెద్దవాగు ప్రాజెక్టు 3 గేట్లను ఎత్తి దిగువకు 5,240 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. ఇదిలా ఉండగా మండలోని పలు చెరువులన్నీ అలుగులు పారుతున్నాయి.

నియోజకవర్గ వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. లోతట్టు గ్రామాల్లో రోడ్లన్నీ చిత్తడిగా మరాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరికొన్ని చెరువులకు పూర్తి స్థాయిలో అలుగుపడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 

 

Latest Updates