ముంబైని ముంచెత్తిన భారీ వర్షం

మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షం కురుస్తోంది.ఇవాళ( శుక్రవారం) తెల్లవారుజాము నుంచే ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.. రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడి కక్కడే నిలిచిపోయాయి. ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చిన జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడాలా, కింగ్స్‌ సర్కిల్‌, హింద్‌ మాతా ఏరియాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి.

Latest Updates