ఉత్తర తెలంగాణలో జోరుగా వర్షాలు

రాష్ట్రంలో మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం నుంచి  కొన్ని జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. జయ శంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ , కామారెడ్డి, మంచిర్యాల, మహబూబా బాద్, మెదక్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. గత 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో 14.5, మొగుళ్లపల్లిలో 13.8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మండలంలో 13.8, వరంగల్ అర్బన్ జిల్లా చింతగట్టులో 13.5, కామారెడ్డి జిల్లా బిక్కనూరులో 13, మంచిర్యాల జిల్లా చెన్నూరులో 12, మెదక్ జిల్లాలో వాడిలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.

రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవచ్చని అధికారులు చెప్పారు. ఉత్తర , తూర్పు తెలంగాణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చని వెల్లడించింది.

Latest Updates