మరో 3 రోజులు భారీ వానలు

హైదరాబాద్‌, వెలుగు: రాష్ట్రంలో రానున్న మూడు రోజులపాటు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోందని పేర్కొంది. దీనికి అనుబంధంగా 4.5 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది. రానున్న 48 గంటల్లో ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాలకు దగ్గరలో నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

Latest Updates