ఇవాళ, రేపు భారీ వర్షాలు

హైదరాబాద్‌, వెలుగు:పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం ఉదయం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదారబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. రాష్ర్టంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళవారం భారీ నుంచి అతి భారీ, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సిద్ధిపేట, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, ములుగు, భద్రాద్రి, వరంగల్ అర్బన్‌, రూరల్‌, మహబూబాబాద్, జనగామ, యాదాద్రి, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో వర్షాలు బాగా కురుస్తాయని పేర్కొంది.

ఎస్సారెస్పీ గేట్లు ఓపెన్

Latest Updates