ఉత్తరాదిని వణికిస్తోన్న భారీ వర్షాలు

ఎడతెరిపి లేకుండా గత 24 గంటల నుంచి కురుస్తున్న వర్షాలు ఉత్తరాదిని వణికిస్తున్నాయి. ఈ వర్షాలు మరో 24 గంటలు ఇలాగే కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ వర్షాల వల్ల భాగేశ్వర్, పిత్తోరాగడ్, డెహ్రాడూన్, హరి ద్వార్, చమోలీ జిల్లాలకు ప్రమాదం పొంచి ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే చమోలీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా నదులు పొంగిపొర్లుతున్నాయి.
కొండ చరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని.. బద్రీనాథ్, కేధరీనాథ్ హైవేలను మూసివేసినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, రోహ్ తక్, గురుగావ్, ఘజియాబాద్, ఫరీదాబాద్, పల్వాల్ ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఐఎండి హెచ్చరించింది. ఇప్పటికే ఢిల్లీలో చాలా ప్రాంతాల్లోని రోడ్లు జలమయమై.. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వర్ష సూచనలకు సంబంధించి తాజా శాటిలైట్ చిత్రాలను ఐఎండి విడుదల చేసింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది.

For More News..

వీడియో: వర్షంలోనే త్రివిధ దళాల రిహార్సల్స్

టీఆర్ఎస్ కు చెందిన మరో నేతకు కరోనా

నిన్న ఒక్కరోజే దేశంలో 67 వేల కరోనా కేసులు నమోదు

Latest Updates