ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు..విరిగి పడుతున్న కొండచరియలు

ఉత్తరాఖండ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు చాలాప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా… నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. చవెూలీ జిల్లాలో కుండపోత వర్షానికి కొండచరియలు విరిగిపడుతుండడంతో స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. బద్రీనాథ్‌ జాతీయ రహదారితో పాటు పలు రహదారులపై రాకపోకలు నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలకు వరద పొటెత్తడంతో అలకనంద, పిందర్‌, నందాకిని నదులు ప్రమాదకర స్థాయికి అతి చేరువలో ప్రవహిస్తున్నాయి.  పితోర్‌ఘర్‌, ధర్చాలా జిల్లాలో చాలారోడ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.

రాష్ట్రంలోని పితోర్‌ఘర్‌, భాగేశ్వర్‌, చవెూలీ, నైనిటాల్‌, ఉదమ్‌సింగ్‌ నగర్‌, పౌరీ, తెహ్రీ, డెహ్రాడూన్‌, హరిద్వార్‌ జిల్లాల్లో మరో మూడు రోజుల్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Latest Updates