విద్యార్థి మృతితో SR నగర్‌లో భారీ బందోబస్తు

హైదరాబాద్ SRనగర్‌ జయప్రకాష్‌నగర్‌లో విషాద ఘటన జరిగింది. స్కూల్ టీచర్ల దెబ్బలకు భయపడి బిల్డింగ్ పై నుంచి దూకి తీవ్రంగా గాయపడిన మహేష్ అనే 8వ తరగతి విద్యార్థి చికిత్స పొందుతూ ఇవాళ(శుక్రవారం) తెల్లవారుజామున మృతి చెందాడు. గత నెల 29న విశ్వభారతి స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు కారణమైన పాఠశాల యాజమాన్యాన్ని ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఆందోళనలు చేసేందుకు విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి. దీంతో స్కూలు ముందు SRనగర్‌ పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

Latest Updates