రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు

తెలంగాణలో మళ్లీ భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో సోమ‌వారం అల్ప‌పీడ‌నం ఏర్ప‌డే అవ‌కాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది మంగ‌ళ‌వారం నాటికి మ‌రింత బ‌ల‌ప‌డొచ్చని తెలిపింది. దీనికి తోడు ద‌క్షిణ కోస్తాంధ్ర తీరానికి ద‌గ్గ‌రగా.. ప‌శ్చిమ మ‌ధ్య బంగాళాఖాతంలో 5.8 కిలోమీట‌ర్ల ఎత్తువ‌ర‌కు ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ఏర్ప‌డింది. ఫ‌లితంగా నేటి నుంచి రానున్న మూడు రోజుల పాటు అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కుర‌వొచ్చ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. ఆది , సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు మంగ‌ళ‌వారం అనేక చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది.

Latest Updates