బేగం పేట్ – సికింద్రాబాద్ ల మధ్య భారీ ట్రాఫిక్ జామ్

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దుతుగా కాంగ్రెస్ అధిష్టానం ప్రగతిభవన్ ముట్టడికి పిలుపునిచ్చింది.  అధిష్టానం పిలుపు నేపథ్యంలో ఆ పార్టీ అగ్రనాయకులు, సీనియర్ నేతలు ప్రగతిభవన్ ను ముట్టడించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముట్టడికి యత్నించిన ఆందోళన కారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో బేగం పేట నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టూవీలర్లు, ఆటోలు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించిన అవి విఫలం అవున్నట్లు తెలుస్తోంది.

Latest Updates