సొంతూళ్ల నుంచి హైదరాబాద్‌కు : టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం

విజయవాడ- హైదరాబాద్ హైవేపై టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జాం అయింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లిన వారంతా తిరిగి వస్తున్నారు. దీంతో…. సూర్యాపేట జిల్లా కొర్లపహాడ్, నల్గొండ జిల్లా పంతంగి టోల్ గేట్ల దగ్గర 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. హైదరాబాద్ వైపు ఏడు గేట్లను ఓపెన్ చేసి.. వాహనాలను క్లియర్ చేస్తున్నారు ట్రాఫిక్, టోల్ సిబ్బంది. అయినా కూడా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

అయితే ఇప్పటి వరకు 87 శాతం వాహనాలు ఫాస్ట్ టాగ్ చేయించుకున్నాయని…. ఇంకా 13 శాతం వాహనదారులు చేయించుకోవాల్సి ఉందని… టోల్ ప్లాజా అధికారులు తెలుపుతున్నారు. అటు ట్రాఫిక్ జాం కావటంతో టోల్ ప్లాజా సిబ్బందిపై మండిపడుతున్నారు వాహనదారులు.

 

Latest Updates