ఫాస్టాగ్ ప్రాబ్లమ్స్ : టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్

సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో హైదరాబాద్ ప్రజలు పల్లెబాట పట్టారు. దీంతో బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. మరోవైపు కార్లలో సొంతూళ్లకు వెళుతుండటంతో టోల్ గేట్ల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది.  విజయవాడ-హైదరాబాద్ హైవేపై  భారీగా ట్రాఫిక్ జామయ్యింది. ఉమ్మడి నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా దగ్గర కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భువనగిరి, పగిడిపల్లి టోల్ ప్లాజా దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

దీంతో గంటల సమయం ఎదురుచూడలేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫాస్టాగ్ సౌకర్యం లేనివారు ఎక్కువ సేపు ఎదురు చూడాల్సి వస్తోందని చెబుతున్నారు.

Latest Updates