నీళ్లే నీళ్లు..కృష్ణా, గోదావరిల్లోకి పోటెత్తుతున్న వరద

  • జూరాల నుంచి 1.65 లక్షల క్యూసెక్కులు కిందికి
  • నిండు కుండలాతుంగభద్ర డ్యామ్‌.. నేడు గేట్లెత్తేచాన్స్‌
  • దిగువ గోదావరిలో పెరిగిన నీటి ఉధృతి
  • కాళేశ్వరం లింక్‌-1లో ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ నదిలోకి
  • రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు

 

హైదరాబాద్‌/కాటారం, వెలుగు: కృష్ణా, గోదావరి నదులు నీళ్లతో కళకళలాడుతున్నాయి. కృష్ణా ప్రాజెక్టులన్నింటికీ వరద పోటెత్తుతుండగా గోదావరిలో దిగువన నీటి ఉధృతి కొనసాగుతోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వస్తోంది. దీంతో కర్నాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ డ్యామ్‌ల నుంచి నీటిని జూరాలకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు 1.65 లక్షల ఇన్‌ఫ్లో వస్తుండగా అంతే నీటిని కిందికి వదులుతున్నారు. ఇటు తుంగభద్ర నదికి కూడా పెద్దఎత్తున వరద వస్తోంది. ఇంకో 6 టీఎంసీలైతే కర్నాటకలోని తుంగభద్ర డ్యామ్‌ పూర్తిగా నిండనుంది. ప్రాజెక్టుకు 60 వేల క్యూ సెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుండటంతో శనివారం తుంగభద్ర గేట్లెత్తే అవకాశం ఉంది. జూరాల ప్రాజెక్టు కెపాసిటీ 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.61 టీఎంసీల నీళ్లున్నా యి. శ్రీశైలంలో 215.81 టీఎంసీల కెపాసిటీకి గాను 127.91 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో 312.05 టీఎంసీల కు గాను 243.20 టీఎంసీల నీళ్లున్నాయి.

కాళేశ్వరం దగ్గర గోదావరి ఊగ్రరూపం

గోదావరిలో కూడా వరద పోటెత్తుతోంది. మధ్య గోదావరిలో మోస్తరు ప్రవాహాలే ఉన్నా ప్రాణహితలో వరద ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రా జెక్టుకు 18 వేలు, ఎస్సారెస్పీకి 14 వేలు, ఎల్‌ఎండీకి 3 వేలు, కడెం ప్రాజెక్టుకు 1,830, ఎల్లంపల్లికి 35 వేల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. కాళేశ్వరం వద్దగోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎగువ గోదావరిలో మాత్రంపెద్దగా ప్రవాహాలు లేవు. ఎస్సారెస్పీకి 7,300 క్యూ సెక్కుల నీరు వస్తోంది. ప్రా జెక్టు కెపాసిటీ 90.31 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41.7 టీఎంసీల నీళ్లున్నా యి.

ఎత్తిపోసిన నీళ్లు మళ్లీ నదిలోకి

కాళేశ్వరం లింక్‌-1లో ఎత్తిపోసిన నీళ్లను మళ్లీ సముద్రంలోకి వదిలారు. ఎగువ నుంచి వరద రావట్లేదని ఆలస్యంగానే ఎత్తిపోతలు మొదలు పెట్టినా ఈసారీ నీళ్లుకిందికి వదలక తప్పలేదు. అన్నారం బ్యారేజీకి కింది నుంచి 6.5 టీఎంసీల నీటిని ఎత్తిపోయగా అందులోంచి సగం వరకు నీళ్లను ఎల్లంపల్లిలోకి ఎత్తిపోశారు. అయితే మానేరు నుంచి గోదావరిలో కి 62 వేల క్యూసెక్కుల వరద అన్నారం బ్యారే జీకి చేరుతోంది. దీంతో బ్యారేజీ పూర్తి మట్టం 119 మీటర్లకు గాను శుక్రవారం సాయంత్రానికి 118.5 మీటర్లకు చేరుకోవడంతో 11 గేట్లుఎత్తి 29,700 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు.

మేడిగడ్డకు భారీ వరద

మేడిగడ్డబ్యారే జీకి వరద పోటెత్తుతోంది. 2.91 లక్షల క్యూ సెక్కుల వరద వస్తుండగా 57 గేట్లుఎత్తి 2.42 లక్షల క్యూ సెక్కులను నదిలోకి వదిలారు. బ్యా రేజీలో ఇంకో 4 అడుగుల నీళ్లుచేరితే ఫుల్‌ లెవల్‌కు చేరుతుంది. శనివారం ఉదయానికి మేడిగడ్డకు వరద భారీగా చేరుతుందని అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం త్రివేణి సంగమ వద్దపుష్కర ఘాట్‌లో 9 మీటర్లఎత్తులో నీళ్లుప్రవహిస్తున్నాయి. భక్తులెవరూ నదిలోకి దిగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు

రాష్ట్రంలో ఆగని వానలు

రాష్ట్రాన్ని ముసురు వదలట్లేదు. ఎడతెరిపి లేకుండా వానలు పడుతూనే ఉన్నాయి. అనేక చోట్లమోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం ములుగు, భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, మంచిర్యాల, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వానలు పడ్డాయి. ములుగులోని వెంకటాపురంలో 15.5 సెంటీ మీటర్లు, మంగపేట్‌లో 15.2, తాడ్వాయిలో 13, మేడారంలో 12.8, భూపాలపల్లిలోని చెల్పూరులో 12, ములుగులోని వాజీడులో 11.7, భూపాలపల్లిలోని ముత్తారం మహ దేవ్‌పూర్‌లలో 11.4 సెంటీమీటర్లచొప్పున వరపాతం ్ష రికార్డయింది. ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్ద పల్లి, కరీంనగర్, జయశం కర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్- అర్బన్‌, వరంగల్- రూరల్‌, మహబూబాబాద్, కొత్తగూ డెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఒకటి రెం డు చోట్ల శనివారం భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని హైదరాబాద్‌ వా తావరణ కేంద్రం తెలిపింది.

Latest Updates