హీరాగోల్డ్ బాధితులు 2లక్షలు

హైకోర్టుకు తెలిపిన ఈడీ

హైదరాబాద్, వెలుగు: ‘‘నౌహీరా షేక్‌‌ సా రథ్యంలోని హీరాగోల్డ్‌‌ గ్రూప్‌‌ 2లక్షల మందిని మోసం చేసింది. రూ.5,600 కోట్ల లావాదేవీలు నిర్వహించింది. జనం డబ్బుతో భూములు, ఇతర ఆస్తులు కొనుగోలు చేసింది. హీరాగోల్డ్‌‌పై దేశ వ్యాప్తంగా 30కి పైగా కేసులు నమోదయ్యాయి. రూ.300 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశాం” అని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)అసిస్టెంట్‌‌ డైరెక్టర్‌‌ ఎం.హరికృష్ణారెడ్డి హైకోర్టులో ఫైల్ చేసిన అఫిడవిట్‌‌లో పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో సయ్యద్‌ అఫ్సర్, సయ్యద్‌ అక్తర్, సయ్యద్‌ కైసర్‌‌లను సాక్షులుగా పిలిస్తే ముందస్తు బెయిల్‌‌ కోసం వారు కోర్టును ఆశ్రయించడాన్ని ఈడీ తప్పుపట్టింది. అక్తర్‌‌కు ఆరుసార్లు, మిగిలిన వారికి ఒక్కోసారి నోటీస్ ఇచ్చినా విచారణకు హాజరు కాలేదని ఈడీ హైకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న జస్టిస్‌‌ జి.శ్రీదేవి పిటిషనర్లకు బెయిల్‌‌ నిరాకరించారు.విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

Latest Updates