ముగిసిన షీలా దీక్షిత్‌ అంత్యక్రియలు

న్యూఢిల్లీ : గుండెపోటుతో కన్నుమూసిన ఢిల్లీ మాజీ సీఎం, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత షీలా దీక్షిత్ అంత్యక్రియలు ముగిశాయి. అధికారిక లాంఛనాల మధ్య ఆమె పార్థివ దేహానికి ఢిల్లీలోని నిగమ్‌ బోధ్‌ ఘాట్‌ లో అంత్యక్రియలు నిర్వహించారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా దివంగత నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు పెద్దసంఖ్యలో పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.

యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ, రాబర్ట్ వాద్రా, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌ నాథ్‌, రాజస్ధాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

Latest Updates