బిలియనీర్ కోసం కాదు.. పేషెంట్​ కోసం

నాలుగు గంటలుగా ట్రాఫిక్ జామ్.. వెహికిల్స్ హారన్ల మోత, ఇంజిన్ల సౌండ్ తో ఆ ప్రాంతమంతా గజిబిజిగా ఉంది. ఇంతలో అక్కడికి ఒక చాపర్ వచ్చింది. నడిరోడ్డుపై ల్యాండ్ అయ్యింది. ఎవర్నో ఎక్కించుకున్న హెలికాప్టర్ వెంటనే గాల్లోకి లేచింది.  ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ బిలీనియర్ ను హెలికాప్టర్ ఎక్కించుకుని వెళ్లిందని కాదు.. కాదు.. ఆయన గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చిందని రూమర్లు చక్కర్లు కొట్టాయి. అదేమీ కాదు ట్రాఫిక్ జామ్ లో స్ట్రోక్ కు గురైన వ్యక్తిని రెస్క్యూ చేసేందుకు హెలికాప్టర్ వచ్చినట్లు బీబీసీ క్లారిటీ ఇచ్చింది.  ట్రాపికల్ ఆర్కిటిక్ లాజిస్టిక్స్ లిమిటెడ్ అనే కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్ పై అధికారులు విచారణకు ఆదేశించారు. దీనిపై ఆ కంపెనీ అధికారులు మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయాల్లో తాము రెస్పాండ్ అవుతామని, బాధితుల్ని ఎయిర్ లిఫ్ట్ చేస్తామన్నారు.  రెండు నెలల్లో ఆరు సార్లు తమకు ఎమర్జెన్సీ కాల్స్ వచ్చినట్లు చెప్పారు. హై బీపీతో బాధపడుతున్న వ్యక్తిని ఎయిర్ లిఫ్ట్ చేసినట్లు తెలిపారు.

Latest Updates