రాజన్న ఆలయానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ కు హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే రమేష్ బాబు ఈ సేవలను ప్రారంభించారు. రమేష్ బాబు దంపతులు హెలి కాఫ్టర్ లో తొలి ప్రయాణం చేసి వేములవాడ చేరుకున్నారు. ఈ హెలికాప్టర్ ప్రయాణం ద్వారా వేములవాడ రాజన్న క్షేత్రంతో పాటు శ్రీ రాజరాజేశ్వర జలాశయం అందాలను కూడా వీక్షించే అవకాశం ఉంది.

ఈ రోజు (గురువారం) నుంచి ఈ నెల 23వ తేదీ వరకు హెలికాప్టర్‌ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. మొత్తం మూడు రకాల ప్యాకేజీలుగా ఉన్న ఈ సేవల్లో ప్యాకేజీ-1లో వేములవాడ నుంచి వ్యూపాయింట్‌కు 7 నిమిషాల రైడ్‌కు టికెట్‌ ధర రూ.3 వేలు ఉంటుంది. ప్యాకేజీ-2లో వేములవాడ మిడ్‌మానేరు పరిసర ప్రాంతాలు వీక్షించేందుకు ధర రూ.5,500 లు. ఈ ప్యాకేజీలలో కనీసం ఆరుగురు వ్యక్తులు ఉండాలి. 16 నిమిషాల విహంగ వీక్షణం. ప్యాకేజీ-3లో హైదరాబాద్‌ నుంచి వేములవాడకు తిరిగి హైదరాబాద్‌కు. టికెట్‌ ధర రూ. 30 వేలు. కనీసం ఐదుగురు వ్యక్తులు ఉండాలి.

 

Latest Updates