హెలికాప్టర్ ను ఎత్తుకెళ్లిన మరో హెలికాప్టర్ – వీడియో

సాధారణంగా ఓ వాహనం పాడైతే.. మరో వాహనానికి కట్టి లాక్కెళ్లడం చూస్తుంటాం. అయితే.. ఉత్తరాఖండ్ లో ఓ హెలికాప్టర్ పాడైతే.. మరో హెలికాప్టర్ కు కట్టి తీసుకెళ్లారు. కేదార్ నాథ్ లో  ఎత్తైన కొండప్రాంతంలో సాంకేతిక లోపంతో ఓ ప్రయివేటు హెలికాప్టర్  కూలిపోయింది. దీంతో అక్కడికి చేరుకున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ కు ప్రయివేటు హెలికాప్టర్ ను తాడుతో కట్టి తీసుకెళ్లారు. కేదార్ నాథ్ నుంచి డెహ్రాడూన్ వరకు.. గాలిలో ఎగురుతూ పాడైన హెలికాప్టర్ ను తీసుకెళ్లింది ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్.

Latest Updates