నా శాపం వల్లే కర్కరే చనిపోయాడు: సాధ్వి ప్రజ్ఞాసింగ్

Hemant Karkare cursed by me, Brags Sadhvi Pragya.

సాధ్వి ప్రజ్ఞా సింగ్ వివాదాస్పద కామెంట్లు

భోపాల్:ముంబై యాంటీ టెర్రరిస్ట్​ స్క్వాడ్(ఏటీఎస్) చీఫ్,26/11 టెర్రర్​ అటాక్​ హీరో హేమంత్ కర్కరేను ఉద్దేశించి మాలేగావ్ పేలుళ్ల నిందితురాలు, బీజేపీ భోపాల్ లోక్​సభ  సెగ్మెంట్​ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను శపిం చడం వల్లే టెర్రరిస్టుల కాల్పుల్లో కర్కరే చనిపోయాడని, తనను ఆయన తీవ్రంగా హింసించాడని,ఆ టార్చర్​ను తట్టుకోలేకపోయానని పేర్కొన్నారు .భోపాల్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ సాధ్వి ప్రజ్ఞా ఈ షాకింగ్ స్టేట్​మెంట్​ ఇచ్చారు . ఈ సందర్భంగా తనకు కస్టడీలో ఎదురైన అనుభవాలను చెపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. 2008లోజరిగిన మాలేగావ్ పేలుళ్లలో ఆరుగురు చనిపోగా..వంద మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు .

ఈ పేలుళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలపై మహారాష్ట్ర ఏటీఎస్ సాధ్వి ప్రజ్ఞా సింగ్ తో పాటు మరికొందరినీ అరెస్ట్​ చేసింది. ఈ కేసులో సాధ్వి ప్రధాన నిందితురాలు. ఈ కేసు విచారణ సందర్భంగా కర్కరే తనను తీవ్రంగా టార్చర్​ పెట్టాడని, తనపై ప్రశ్నల వర్షం కురిపించాడని, తాను అమాయకురాలిని కావడంతో తన దగ్గర సమాధానాలు లేవని సాధ్వి చెప్పారు. అయితే తన నుంచి సమాధానాలు రాబట్టేందుకు కర్కరే బెదిరింపులకు దిగాడని, కస్టడీలో తనను అత్యంత దారుణంగా ట్రీట్​ చేశారని ఆరోపించారు . ‘‘ఇన్వెస్టిగేషన్ టీమ్ కర్కరేను పిలిచి ఆధారాలు లేకుంటే నన్నువదిలేయాలని చెప్పింది. కానీ నాకు వ్యతిరేకంగా ఆధారాలు సేకరించేందుకు ఎందాకైనా వెళతానని కర్కరే వారికి చెప్పాడు . నన్ను అతను వదిలిపెట్టలేదు.అతనో దేశ వ్యతిరేకి. ధర్మ విరోధి. మీరు నమ్మకపోవచ్చు. కానీ.. నేను అతను సర్వ నాశనం అయిపోవాలని శాపం పెట్టాను. ఇది జరిగిన నెల తర్వాత టెర్రరిస్టులు అతడిని చంపేశారు”అని సాధ్వి చెప్పింది.

అమరవీరులను గౌరవించాలి

కర్కరేపై ప్రజ్ఞా కామెంట్లను ఐపీఎస్ ఆఫీసర్ల సంఘం ఖండించింది. టెర్రరిస్టులతో పోరాడి ప్రాణాలర్పించిన కర్కరేపై అవమానకర వ్యాఖ్యలు చేయడం తగదని, పోలీసు అమరవీరులను గౌరవించాలని డిమాండ్ చేసింది.ఆమె వ్యాఖ్యలను కాం గ్రెస్, పీడీపీ, ఎంఐఎం పార్టీలూ తప్పుపట్టాయి. సాధ్వి కామెంట్లతో-బీజేపీ ఇరకాటంలో పడింది. కర్కరేపై ప్రజ్ఞా వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని, బీజేపీ ఆయన్నుఅమరవీరుడిగానే గుర్తిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. తనపై వేధింపుల వల్లే ప్రజ్ఞా అలా మాట్లాడి ఉంటారని పేర్కొంది. కాగా,ప్రజ్ఞా వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్ లో ఫిర్యాదు నమోదైంది. ప్రజ్ఞా వ్యాఖ్యలపై పరిశీలన జరుపుతామని మధ్యప్రదేశ్ సీఈవో చెప్పారు.

Latest Updates