జైలు నుంచి విడుదలయ్యానో లేదో.. అప్పుడే బీజేపీ కుట్ర చేస్తుంది: హేమంత్ సోరేన్ 

జైలు నుంచి విడుదలయ్యానో లేదో.. అప్పుడే బీజేపీ కుట్ర చేస్తుంది: హేమంత్ సోరేన్ 

జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. జైలు నుంచి విడుదలయ్యానో లేదో.. అప్పుడే తనపై మళ్లీ బీజేపీ బడా నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. భూకుంభకోణం కేసులో జార్ఖండ్  హైకోర్టు హేమంత్ సోరేన్ కు శుక్రవారం (జూన్ 28) బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పై విడుదలైన అనంతరం జరగిన ర్యాలీ హేమంత్ సోరేన్ బీజేపీ నేతలపై ఆగ్రహం మండిపడ్డారు. 

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన సంతాల్ తిరుగుబాటులా.. భూస్వామ్య శక్తులను తరిమికొట్టేందుకు తాను తిరుగుబాటుకు సిద్దమయ్యానని.. తన న్యాయ పోరాటాన్ని మరుగు పర్చేందుకే అరెస్ట్ కుట్రలు చేశారని అన్నారు. ఇది బీజేపీ వ్యూహంలో ఒక భాగమని అన్నారు. 1855 జూన్ 30 న బ్రిటీష్ పాలకులపై తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు. ఇది మనకు శుభదినం.. మనందరికి ఆచరణీయమైన రోజు అని హేమంత్ సోరేన్ అన్నారు. ‘‘నన్ను తప్పుడు కేసులో ఇరికించారు. కేంద్రం తనకు వ్యతిరేకంగా గొంతు పెంచేవారిని దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని’’ హేమంత్ సోరేన్ అన్నారు. 

శుక్రవారం (జూన్ 28) రాంచీలోని బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి హేమంత్ సోరేన్ విడుదలయ్యారు. ఆయన భార్య కల్పనా సోరేన్, జేఎంఎం ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ పాండే ఆయను స్వాగతం పలికారు. జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోంగోన్ ముఖోపాధ్యాయ బెయిల్ మంజూరు చేస్తూ.. ప్రాథమికంగా హేమంత్ సోరేన్ ఈ నేరంలో దోషి కాదని.. బెయిల్ పై ఉన్నపుడు అతను నేరం చేసే అవకాశం లేదని ఉత్తర్వుల్లోవెల్లడించారు.