29న సీఎంగా హేమంత్ సొరేన్‌ ప్రమాణస్వీకారం

జార్ఖండ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. ఈ నెల 29న సీఎంగా JMM చీఫ్‌ హేమంత్ సొరేన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో JMM-కాంగ్రెస్‌-RJD నేతృత్వంలోని మహాకూటమి 47 స్థానాల్లో విజయం సాధించి అధికారం దక్కించుకుంది. ఈ క్రమంలో కూటమి నాయకుడు హేమంత్‌ సీఎం పదవి చేపట్టనున్నారు. హేమంత్‌ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు హాజరయ్యే అవకాశం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్‌కు స్పీకర్‌ పదవితోపాటు నాలుగు నుంచి ఐదు మంత్రి పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది.

Latest Updates