బుర్రకథ టీజర్ : సన్యాసి లుక్ లో ఆది

రత్నబాబు డైరెక్షన్ లో ఆది హీరోగా తెరకెక్కుతున్న సినిమా బుర్రకథ. ఆది సరసన మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తన్న ఈ మూవీ టీజర్ సోమవారం రిలీజైంది. నిమిషం 23 సెకన్లున్న ఈ టీజర్ ప్రారంభంలో..‘నాన్నగారూ.. నేనొక బ్రహృత్తరమైన నిర్ణయం తీసుకున్నాను..’ అంటూ ఆది చెప్పే డైలాగుతో టీజర్‌ మొదలైంది. ఇందులో ఆయన అభి, రామ్‌ అనే రెండు పాత్రల్లో కనిపిస్తారు. అభి తుంటరి కుర్రాడిగా కనిపిస్తాడు. రామ్‌ పద్ధతిగా, భారతీయ సంప్రదాయాలకు విలువిచ్చే వ్యక్తిగా కనిపిస్తాడు. ‘బ్రహ్మచారి పట్టాతో సన్యాసం తీసుకుంటున్నా నాన్నగారూ..’ అని రామ్‌.. తన తండ్రి రాజేంద్రప్రసాద్‌కు చెప్పడంతో అతను షాకవడం ఫన్నీగా ఉంది. త్వరలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Latest Updates