మళ్లీ హిట్ కొట్టాడు!

వేసిన ప్రతి అడుగూ విజయం వైపే పడటం అరుదు. కానీ చేసిన ప్రతి సినిమాతో సక్సెస్ అందుకోవడం అక్షయ్​ కుమార్​కి అలవాటైపోయింది. కొన్నేళ్లుగా ఫ్లాప్ అన్నదే రాలేదు అక్కీకి. రీసెంట్‌‌గా రిలీజైన ‘మిషన్‌‌ మంగళ్‌‌’ కూడా భారీ సక్సెస్ సాధించింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు విడుదలైన ఈ సినిమా మొదటి రోజే 29.16 కోట్లు రాబట్టింది. రెండో రోజు కూడా ఇరవై కోట్ల వరకూ వెళ్లింది. మూడో రోజు కూడా ఎక్కడా తగ్గలేదు.

అక్షయ్ కెరీర్‌‌‌‌లోనే ఇది అత్యంత భారీ ఓపెనింగ్‌‌. అంటే అతడు మళ్లీ హిట్ కొట్టాడు. ఈసారి ప్రతిసారి కంటే గట్టిగా కొట్టాడు. సైంటిస్ట్ రాకేష్‌‌ ధావన్‌‌ పాత్రను చాలా ఈజ్‌‌తో చేసి మెప్పించాడు. అతనికి తోడు ఓ కీలక పాత్రలో విద్యాబాలన్‌‌ కూడా అదరగొట్టేసింది. వీరికి తాప్సీ, నిత్యామీనన్, కృతి, శర్మాన్‌‌ జోషి లాంటి యాక్టర్స్‌‌ తోడయ్యారు. మంగళ్‌‌యాన్ ప్రాజెక్టును సక్సెస్‌‌ చేయడానికి కొందరు సైంటిస్టులు పడిన తపనను  ఆకట్టుకునేలా తీయడంలో డైరెక్టర్ జగన్‌‌ శక్తి పూర్తిగా సక్సెస్ అయ్యాడు. దాంతో ‘మిషన్ మంగళ్’ అదిరింది. అక్కీ విజయాల జాబితాలో చేరిపోయింది.

Latest Updates