స్వాతంత్ర్య సమరయోధులే స్ఫూర్తిగా ముందుకెళ్దాం

హైదరాబాద్: స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారి స్ఫూర్తితో సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలని ప్రముఖ హీరో, బసవతారకం ఇండో-క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ పిలుపునిచ్చారు. తన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ కాన్సర్ రోగుల కోసం సేవాభావంతో బసవతారకం ఆస్పత్రిని ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. అందరికీ 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బాలయ్య.. కరోనాతో పోరాడి అసువులు బాసిన వారికి నివాళులు అర్పించారు. ‘మన దేశంలో తయారైన వ్యాక్సిన్‌‌లు విదేశీ ప్రజలకు సైతం ఉపయోగపడుతుండటం చాలా మంచి విషయం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వాక్సినేషన్ ప్రక్రియ అద్భుతంగా కొనసాగుతోంది. బసవతారకం ఆస్పత్రిలోనూ టీకా ప్రక్రియ ప్రారంభమైంది. గ్రహణ మొర్రితో బాధపడుతున్న 3,200 మంది చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నాం’ అని బాలకృష్ణ చెప్పారు.

Latest Updates