ఇంటి వద్దకే బైక్ డెలివరీ

    హీరో మోటోకార్ప్ న్యూ ప్రొగ్రామ్

    25 నగరాలకు ఈ కార్యక్రమం

న్యూఢిల్లీ : బైక్‌‌‌‌లను, స్కూటర్లను కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేస్తోంది హీరో మోటోకార్ప్. స్వల్ప ఛార్జీకి టూవీలర్స్‌‌‌‌ను తన కస్టమర్ల ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నామని ఈ కంపెనీ ప్రకటించింది. ఈ సర్వీసులను ఇప్పటికే ముంబై, బెంగళూరు, నోయిడా ప్రాంతాల్లో కంపెనీ ప్రారంభించింది. వచ్చే కొన్ని నెలల్లో మరో 25 నగరాలకు ఈ ప్రొగ్రామ్‌‌‌‌ను విస్తరించాలనుకుంటున్నట్టు హీరో మోటోకార్ప్‌‌‌‌ తెలిపింది. అయితే కస్టమర్లు బుక్ చేసుకున్న వెహికిల్‌‌‌‌ను ఇంటి వద్దకు డెలివరీ చేయాలంటే రూ.349 ఛార్జీని చెల్లించాల్సి ఉంది. ‘నూతన విధానాలను అభివృద్ధి చేయడంపై మేము ఇన్వెస్ట్‌‌‌‌మెంట్లను కొనసాగిస్తూ ఉన్నాం. ఉన్నతమైన అనుభవాన్ని మా కస్టమర్లకు అందించడానికి బిజినెస్ మోడల్స్‌‌‌‌ను రూపొందిస్తున్నాం. ఈ కొత్త విధానం, టూవీలర్ కేటగిరీలోని కస్టమర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది’ అని హీరో మోటోకార్పొ సేల్స్ హెడ్ సంజయ్ భాన్ చెప్పారు. ప్రతి కొనుగోలుపై వాల్యు యాడెడ్ సర్వీసుల కోసం యువత చూస్తున్నారని అన్నారు. ఈకామర్స్ స్పేస్‌‌‌‌లోకి వెళ్తోన్న తొలి కంపెనీ మాదేనని, ఈ కొత్త సర్వీస్‌‌‌‌ల లాంచింగ్‌‌‌‌తో ఈ ట్రెండ్‌‌‌‌ను కొనసాగిస్తామని భాన్ చెప్పారు.  ఇంటి వద్దకే కాకుండా.. కస్టమర్లు ఎంచుకున్న ఏ అడ్రస్‌‌‌‌కైనా టూవీలర్​ను డెలివరీ చేయనున్నామని భాన్ తెలిపారు.  దేశంలో అమ్ముడుపోతున్న ప్రతి రెండు టూవీలర్లలో ఒకటి హీరోదేనని  ​ తెలిపారు.

Latest Updates