షూటింగ్ లో ప్రమాదం : సినీ హీరో గోపీచంద్ కు గాయాలు

సినిమా హీరో గోపీచంద్ షూటింగ్ లో గాయపడ్డాడు. రాజస్థాన్ లో ఆయన కొత్త సినిమా షూటింగ్ జరుపుతుండగా ఆయనకు స్వల్ప ప్రమాదం జరిగిందని చిత్రయూనిట్ తెలిపింది. వెంటనే గోపీచంద్ ను దగ్గర్లోని హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. గోపీచంద్ కు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఆయనకు ప్రమాదం లేదని.. అభిమానులు ఆందోళన చెందొద్దని చిత్రయూనిట్ తెలిపింది.

గోపీచంద్ హీరొగా తిరు దర్శకత్వంలో అనిల్ సుంకర్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం జైపూర్ దగ్గరున్న మాండవలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రోజుతో అక్కడ చిత్రీకరణ ముగియాల్సి ఉంది. బైక్ చేజింగ్ పోరాట సన్నివేశాలు తీస్తున్న టైమ్ లో.. గోపీచంద్ నడుపుతున్న బైక్ స్కిడ్ అయింది. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి‌. గోపీచంద్ ఆరోగ్యానికి ఎలాంటి హాని లేదని, గాయాలకు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మిగిలిన చిత్రీకరణ చేసుకోవచ్చని అక్కడి ఫోర్టీస్ హాస్పిటల్స్ డాక్టర్స్ తెలిపారు.

Latest Updates