మరింత మైలేజ్.. బెటర్ స్పీడ్ పికప్: హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బీఎస్-6 బైక్

కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన బీఎస్‌‌-–6 రూల్స్‌‌ ప్రకారం తయారు చేసిన 100సీసీ బైక్​ హెచ్‌‌ఎఫ్‌‌ డీలక్స్‌‌ను హీరో మోటోకార్ప్‌‌ మంగళవారం ఢిల్లీలో లాంచ్‌‌ చేసింది. దీని ఎక్స్‌‌షోరూం ధరను రూ.55,925లుగా నిర్ణయించింది. సెల్ఫ్‌‌ స్టార్ట్‌‌ అల్లాయ్‌‌ వీల్స్‌‌ ఉన్న బైకుకు అయితే రూ.57,250 చెల్లించాలి. ఇందులో ఫ్యూయల్‌‌ ఇంజెక్షన్‌‌ టెక్నాలజీని వాడటం వల్ల బైక్‌‌ ఇంజన్‌‌ మరింత శక్తిమంతంగా ఉంటుందని హీరో మోటోకార్ప్‌‌ తెలిపింది.

ఈ బండి దేశ వ్యాప్తంగా జనవరిలోనే ఆథరైజ్డ్ షోరూమ్స్‌లో అందుబాటులోకి వస్తుంది. బీఎస్-6లో వచ్చిన రెండు వేరియంట్స్ కూడా 9 రెట్లు బెటర్ మైలేజీ ఇస్తాయి. స్పీడ్ పికప్ కూడా 6 రెట్లు ఫాస్ట్‌గా ఉంటుంది.

Latest Updates