ఇస్రో సైంటిస్టులు మన హీరోలు: మహేశ్ బాబు

చంద్రయాన్ 2పై హీరో మహేశ్ బాబు స్పందించారు. సక్సెస్ అనేది గమ్యం కాదని.. అదోక ప్రయాణం అని ట్వీట్ చేశారు. చంద్రయాన్2 లో భాగస్వామ్యమైన ప్రతీ ఒక్క సైంటిస్ట్‌కు తాను గౌరవంతో సెల్యూట్ చేస్తున్నాని అన్నారు. మీరు మాకు నిజమైన హీరోలని.. యావత్ దేశం సైంటిస్ట్‌లకు అండగా నిలుస్తుందని చెప్పారు. మీ ప్రయాణం ఎప్పటిలాగే కొనసాగించండి… విజయాలు అవే వస్తాయని ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తుండగా… రశ్మిక మంధన హీరోయిన్ గా చేస్తుంది. చాలా గ్యాప్ తరువాత లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు.

Latest Updates